కాలిఫోర్నియా : భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ, ఆండ్రే గొరన్సన్ (స్వీడన్) ద్వయం ఇండియానా వెల్స్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో బాంబ్రీ-గొరన్సన్ ద్వయం 6-2, 5-7, 10-5తో హెలొవర (ఫిన్లాండ్)-పాటెన్ (యూకే) జోడీని మట్టికరిపించింది. గురువారం జరుగబోయే క్వార్టర్స్‌లో బాంబ్రీ-గొరన్సన్ జోడీ.. స్మిత్ (ఆస్ట్రేలియా)- ఫెర్నాండో రొంబొలి (బ్రెజిల్)ను ఢీకొననుంది.