కాలికట్ : కాలికట్ వేదికగా ఆదివారం ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్) నాలుగో సీజన్ వేలంపాట ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్లాటీనం కేటగిరీ నుంచి శిఖర్సింగ్ను రూ.16లక్షలకు హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ సొంతం చేసుకుంది. శిఖర్‌కు తోడు అమన్‌కుమార్, దీపు వేణుగోపాల్‌ను వరుసగా 11.5 లక్షలు, రూ.5.75 లక్షలకు దక్కించుకుంది. మిగతా ప్లేయర్ల విషయానికొస్తే జెరోమ్ వినీత్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
ప్లాటినం కేటగిరీ నుంచి అతన్ని చెన్నై బ్లిట్జ్ రూ.22.50 లక్షలకు తమ వశం చేసుకుంది. దీంతో లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా వినీత్ నిలిచాడు. స్థానిక ప్లేయర్ షమీముద్దీన్‌ను రూ.22.5 లక్షలకు కాలికట్ హీరోస్ తమ సొంతం చేసుకోగా, జిష్ణు పీవీని బెంగళూరు టార్పెడోస్ రూ.14 లక్షలకు తీసుకుంది.