Australia Open 2023 | క్వార్టర్స్‌లో ప్రణయ్, సింధు, శ్రీకాంత్.. ఇంటిదారి పట్టిన మిధున్
Australia Open 2023 : ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు జోరు కొనసాగిస్తున్నారు. హెచ్ఎస్ ప్రణయ్( HS Prannoy), పీవీ సింధు(PV Sindhu), కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), ప్రియాన్సు రజావత్(Priyanshu Rajawat ) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ఏడో ర్యాంకర్‌ను చిత్తు చేసిన భారత యువ సంచలనం మిధున్ మంజునాథ్(Mithun Manjunath)...
Australia Open 2023 : ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు జోరు కొనసాగిస్తున్నారు. హెచ్ఎస్ ప్రణయ్( HS Prannoy), పీవీ సింధు(PV Sindhu), కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), ప్రియాన్సు రజావత్(Priyanshu Rajawat ) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ప్రణయ్ రెండో రౌండ్లో చైనీస్ తైపీ ఆటగాడు చి యూ జెన్(Chi Yu Jen)ను చిత్తుగా ఓడించాడు. తొలి సెట్ కోల్పోయినా కూడా పట్టుదలతో పోరాడిన ప్రణయ్ చివరి రెండు సెట్లు గెలుచుకున్నాడు. 74 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో 19-21, 21-19, 21-13తో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గత ఎనిమిది టోర్నమెంట్లలో అతను క్వార్టర్స్ చేరడం ఇది ఆరోసారి.
మరో మ్యాచ్‌లో.. శ్రీకాంత్ చైనీస్ తైపీకి చెందిన సు లీ యాంగ్‌ను ఓడించాడు. రజావత్ కూడా చైనీస్ తైపీ ప్లేయర్ వాంగ్ జూ వీ ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు చేరాడు. ఏడో ర్యాంకర్‌ను చిత్తు చేసిన భారత యువ సంచలనం మిధున్ మంజునాథ్(Mithun Manjunath) నిరాశ పరిచాడు. మలేషియా ఆటగాడు లీ జీ జియా చేతిలో అనూహ్యంగా ఓడి, ఇంటిదారి పట్టాడు.
పీవీ సింధు

సింధు అవలీలగా
ఒలింపిక్ మెడలిస్ట్ సింధు భారత్‌కే చెందిన ఆకర్షి కశ్యప(Aakarshi Kashyap)ను చిత్తు చేసి క్వార్టర్స్ చేరింది. ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న ఆమె 21-14, 21-10తో అవలీలగా గెలుపొందింది. తర్వాతి రౌండ్లో సింధుకు గట్టి ప్రత్యర్థి ఎదురవనుంది. అమెరికాకు చెందిన నాలుగో సీడ్ బీవెన్ జాంగ్(Beiwen Zhang)తో ఆమె తలపడనుంది. ఈ సీజన్లో క్వార్టర్స్ స్టేజ్ దాటలేకపోయిన సింధు ఈసారైనా ముందడుగు వేస్తుందా? లేదా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇవి కూడా చదవండి
Manoj Tiwary | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బెంగాల్ మంత్రి.. ఆట నాకెంతో ఇచ్చిందంటూ ఇన్‌స్టాలో పోస్ట్
Team India Captains | జట్టు కోసం ఆ త్యాగాలు చేసిన భారత కెప్టెన్లు వీళ్లే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

