PV Sindhu: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్
ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్‌లో సింధు వరుస గేమ్స్‌లో విజయం సాధించింది.

టోక్యో: ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. దీంతో సింధు ఖాతాలో బ్రాంజ్ మెడల్ చేరింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ సింధు సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు ఇది రెండో మెడల్. తొలి మెడల్‌ను వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అందించిన విషయం తెలిసిందే. ఇక బాక్సర్ లవ్లీనా ఇప్పటికే మరో మెడల్‌ను కూడా ఖాయం చేసింది.
సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్‌కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రెండు మెడల్స్ గెలిచాడు. అతడు 2008 గేమ్స్‌లో బ్రాంజ్, 2012 గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. శనివారం సెమీస్‌లో పరాజయం పాలవడంతో గోల్డ్ మెడల్ గెలవాలన్న ఆమె ఆశలు అడియాసలయ్యాయి. అయితే ఆ ఓటమి నుంచి ఒక రోజు వ్యవధిలోనే సింధు కోలుకుంది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో కఠినమైన చైనా ప్రత్యర్థిపై తొలి గేమ్ నుంచే పైచేయి సాధిస్తూ వచ్చింది. అటాకింగ్ గేమ్ ఆడుతూ.. ఏ సమయంలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ 52 నిమిషాల పాటు సాగింది.
SMASHING VICTORY PV Sindhu !!! 🏸
— Anurag Thakur (@ianuragthakur) August 1, 2021
You dominated the game & made history #Tokyo2020 !
An Olympic medalist twice over! 🥉
India 🇮🇳 is so proud of you & awaits your return!
YOU DID IT ! pic.twitter.com/kpxAAYQLrh
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

