సింధు ఖాతాలో హైలో టైటిల్
హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ 500 టోర్నమెంట్లో భారత్‌కు ఒకేరోజు డబుల్ బొనాంజా. మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్ భారత షట్లర్లే దక్కించుకున్నారు.
- ఫైనల్లో కార్స్ఫెల్ట్పై ఏకపక్ష విజయం
- మెన్స్ విభాగంలో విజేతగా లక్ష్యసేన్
సార్బ్రూకెన్ (జర్మనీ): హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ 500 టోర్నమెంట్లో భారత్‌కు ఒకేరోజు డబుల్ బొనాంజా. మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్ భారత షట్లర్లే దక్కించుకున్నారు. విమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను పీవీ సింధు నెగ్గితే మెన్స్ కేటగిరీలో లక్ష్యసేన్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు.. 21-12, 21-14తో డెన్మార్క్ షట్లర్ లినె కార్స్ఫెల్ట్ను వరుస గేమ్స్‌లో ఓడించి ఈ సీజన్లో జపాన్ ఓపెన్ తర్వాత రెండో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
39 నిమిషాల్లోనే పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సింధు.. ప్రత్యర్థికి కోలుకునే అవకాశమే ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. తొలి గేమ్‌లో సింధు తనదైన క్రాస్ కోర్టు విన్నర్లతో 8-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. డెన్మార్క్ అమ్మాయి ర్యాలీలను పొడిగించేందుకు యత్నించినా ఆమెను నెట్‌వద్దకు తీసుకొచ్చి బోల్తా కొట్టించిన సింధు.. 17-12తో గేమ్‌ను గెలుచుకునేందుకు చేరువైంది. లినె నెట్ వద్ద పదే పదే తప్పులు చేస్తుండటంతో దానిని సద్వినియోగం చేసుకుని తొలి గేమ్‌ను నెగ్గిన ఆమె రెండో గేమ్నూ పెద్దగా కష్టపడకుండానే ముగించింది.
లక్ష్యకు తొలి టైటిల్
ఈ సీజన్లో వరుస ఓటములతో డీలాపడ్డ లక్ష్యసేన్ హైలో ఓపెన్‌లో సత్తాచాటాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో అతడు 21-17, 21-10తో ప్రపంచ ఆరో నంబర్ షట్లర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)ను ఓడించి ఈ ఏడాది తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో సేన్‌కు ఇది రెండో టైటిల్ కావడం విశేషం. తద్వారా హైలో ఓపెన్‌ను రెండుసార్లు గెలుచుకున్న భారత షట్లర్‌గా అతడు రికార్డులకెక్కాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

