IPL 2025 : వర్షం కారణంగా ధర్మశాలలో టాస్ ఆలస్యంగా పడింది. ఔట్‌ఫీల్డ్‌ను దృష్టిలో పెట్టుకొని టాస్ గెలుపొందిన పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 8: 30కి మ్యాచ్ షురూ కానుంది. వాన వల్ల మ్యాచ్‌కు గంట ఆలస్యం అయినప్పటికీ పూర్తిగా 40 ఓవర్ల మ్యాచ్ ఆడిస్తామని అంపైర్లు తెలిపారు.
టాస్కు ముందు మొదలైన వాన 7:40కి వాన తగ్గుముఖం పట్టింది. దాంతో, సిబ్బంది కవర్లను తొలగించగా.. సూపర్ సాపర్స్ ఔట్‌ఫీల్డ్ మీదున్న నీటిని తోడేస్తున్నాయి. రాత్రి 8:00 గంటలకు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు టాస్ 8: 15 గంటలకు వేయాలని నిర్ణయించారు.
🚨 Toss 🚨@PunjabKingsIPL won the toss and elected to bat against @DelhiCapitals in Match 5⃣8⃣.
Updates ▶️ https://t.co/R7eQDiYQI9 #TATAIPL | #PBKSvDC pic.twitter.com/xTJQwODUnL
— IndianPremierLeague (@IPL) May 8, 2025
పంజాబ్ తుది జట్టు: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నేహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, చాహల్.
ఢిల్లీ తుది జట్టు : ఫాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, నటరాజన్.