బెంగళూరు : భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనె బెంగళూరులో నెలకొల్పిన (1994లో) ప్రకాశ్ పదుకొనె బ్యా డ్మింటన్ అకాడమీ (పీపీబీఏ) నుంచి తప్పుకున్నారు. పీపీబీఏ వ్యవస్థాపనలో కీలకంగా వ్యవహరించిన ఆయ న.. ఆ అకాడమీతో దశాబ్దాలుగా తనకున్న అనుబంధాన్ని తెంచుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుకాగా తాజాగా పదుకొనె తప్పుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి.
పదుకొనె వెళ్లిపోవడంతో పీపీబీఏ పేరును ‘సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ ఎక్సలెన్స్’గా మార్చారు. ప్రకాశ్‌తో పాటు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న విమల్ కుమార్ ప్రస్తుతం ఈ అకాడమీని నిర్వహిస్తున్నారు.