నార్వే: దిగ్గజ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు మరోసారి షాకిచ్చాడు. కార్ల్సన్ సొంతగడ్డ నార్వేలో జరుగుతున్న నార్వే చెస్ 2024 టోర్నీలో భాగంగా క్లాసికల్ విభాగంలో అతడిని తొలిసారి ఓడించాడు. మూడో రౌండ్లో తెల్లపావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద.. 37 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను చిత్తుచేశాడు. ఈ విజయంతో అతడు 5.5 పాయింట్లతో అందరికంటే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రజ్ఞానంద సోదరి వై శాలి సైతం మూడు మ్యాచ్‌లలో ఒకటి గెలిచి రెండింటినీ డ్రా చేసుకుని 5.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.