ENG vs WI | పోప్ శతక గర్జన.. స్టోక్స్ హాఫ్ సెంచరీ.. పటిష్టస్థితిలో ఇంగ్లండ్
ENG vs WI : సొంతగడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు జోరు చూపిస్తున్నారు. ట్రెంట్ బ్రిడ్జి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెన్ డకెట్ (71) మెరుపు అర్ధ శతకం కొట్టగా.. ఓలీ పోప్(121) సెంచరీతో కదం తొక్కాడు.
ENG vs WI : సొంతగడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు జోరు చూపిస్తున్నారు. తొలి టెస్టులో మాదిరిగానే రెండో మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ (West Indies)ను బౌలర్లను ఉతికేస్తున్నారు. ట్రెంట్ బ్రిడ్జి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెన్ డకెట్ (71) మెరుపు అర్ధ శతకం కొట్టగా.. ఓలీ పోప్(121) సెంచరీతో కదం తొక్కాడు. మరోవైపు బెన్ స్టోక్స్ (58 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దాంతో, ఇంగ్లండ్ మూడో సెషన్లోనే మూడొందలు కొట్టేసింది.
యువ ఆటగాడు జమీ స్మిత్(14 నాటౌట్)తో కలిసి స్టోక్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. దాంతో, ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసేందుకు మరో 20 ఓవర్లు ఉన్నాయి. వీళ్లిద్దరూ ఇప్పటికే 44 రన్స్ జోడించారు. దాంతో, ఇంగ్లండ్ రెండో టెస్టులో పట్టుబిగిస్తోంది.
Batted, skip 🫡 pic.twitter.com/zm7adHoHBI
— England Cricket (@englandcricket) July 18, 2024
టాస్ ఓడిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ జాక్ క్రాలే(0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బెన్ డకెట్(71), ఓలీ పోప్(121)లు విండీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. డకెట్ బజ్‌బాల్ ఆటతో చెలరేగగా.. పోప్ తనదైన స్టయిల్లో రన్స్ రాబట్టాడు. దాంతో, ఇంగ్లండ్ 4.2 ఓవర్లలోనే యాభై కొట్టి 20 ఏండ్ల రికార్డు బ్రేక్ చేసింది. రెండో వికెట్‌కు 105 రన్స్ కలిపిన ఈ జోడీని విడదీసిన షమర్ జోసెఫ్ పర్యాటక జట్టుకు బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే విండీస్ జో రూట్(14) వికెట్ సాధించింది.
💯💯💯💯💯💯
Brb just watching this on loop 🔁 pic.twitter.com/r0zf567b6t
— England Cricket (@englandcricket) July 18, 2024
అయినా సరే పోప్ మాత్రం చాపకింద నీరులా బౌండరీలతో వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టాడు. హ్యారీ బ్రూక్(36) నిరాశపరిచినా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (58 నాటౌట్)తో కలిసి ఇంగ్లండ్ స్కోర్ దాటించాడు. భారీ స్కోర్ దిశగా వెళ్తున్న పోప్‌ను జోసెఫ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత గత మ్యాచ్ హీరో జమీ స్మిత్ (14 నాటౌట్) అండతో స్టోక్స్ విలువైన భాగస్వామ్యం నెలకొల్పుతున్నాడు. చూస్తుంటే ఇంగ్లండ్ 400 నుంచి 450 కొట్టడం ఖాయమనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
- Under Construction Bridge Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్.. ఉత్తరాఖండ్‌లో ఘటన
- MLA Sabita Reddy | విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
- Matka | మట్కా సెట్స్‌లో నోరా ఫతేహి.. వరుణ్ తేజ్ టీం కొత్త వార్త ఇదే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

