బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్టు(AUSvIND) తొలి రోజు ఆట వర్షం వల్ల నిలిచిపోయింది. టీ బ్రేక్ తర్వాత ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ టైంకు ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనే .. క్రీజ్‌లో ఉన్నారు. ఇద్దరూ బుమ్రా బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 13.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 28 రన్స్ చేసింది. ఆ తర్వాత వర్షం అంతరాయం వల్ల మ్యాచ్‌ను నిలిపేశారు. రెండో రోజు ఆట భారత కాలమాన ప్రకారం ఉదయం 5.20 నిమిషాలకు ప్రారంభంకానున్నది. రేపు 98 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
🚨 UPDATE
Play for Day 1 in Brisbane has been stopped today due to rain.
Play will resume tomorrow and all following days at 09:50 AM local time (5:20 AM IST) with minimum 98 overs to be bowled.#TeamIndia | #AUSvIND
— BCCI (@BCCI) December 14, 2024