PCB : పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను కాదని ఐపీఎల్‌కు ప్రాధాన్యమిచ్చిన ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) చర్యలు చేపట్టింది. సీజన్ ఆరంభానికి ముందు ఐపీఎల్‌కు ఓటేసిన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబని (Blessing Muzarabani)పై వేటు పడింది. పీఎస్ఎల్లో రేండేళ్లు ఆడకుండా అతడిపై పీసీబీ నిషేధం విధించింది. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)కు ఆడుతున్న ముజరబనీపై రెండేళ్లు నిషేధం విధిస్తున్నామని మంగళవారం పాకిస్థాన్ బోర్డు ప్రకటించింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ వేలంలో బ్లెస్సింగ్ ముజరబనిని ఎవరూ కొనలేదు. పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ మినీ వేలంలోనూ ఈ పేసర్ అమ్ముడుపోలేదు. అయితే.. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు గాయపడిన పేసర్ స్థానంలో ఈ ఆఫ్రికా పేసర్‌ను తీసుకుంది. కానీ, సీజన్ ఆరంభానికి ముందే అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ సంప్రదించింది. దాంతో, ముజరబని ఐపీఎల్ ఆడేందుకు మొగ్గు చూపాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ముజరబని కోల్‌కతా గూటికి చేరాడు.
🚨 Blessing Muzarabani banned from PSL for two years 🚨
The Zimbabwe pacer accepted a deal with Islamabad United for #PSL2026 but later pulled out to sign with KKR for #IPL2026.
“In this instance, despite a clear offer and an unequivocal acceptance of essential terms, the… pic.twitter.com/lMDfiXybY6
— Cricbuzz (@cricbuzz) April 14, 2026
తమ లీగ్‌ను కాదని ఐపీఎల్‌కు ప్రాధాన్యమిచ్చిన ముజరబనిపై పీసీబీ భగ్గుమన్నది. అతడిపై రెండేళ్లు నిషేధం విధించింది. అయితే.. స్పెన్సర్ జాన్సన్, దసున్ శనకలు సైతం పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో ఆడుతున్నారు. ఇప్పటివరకైతే ఈ ఇద్దరిపై పాక్ బోర్డు చర్యలు చేపట్టలేదు. కానీ, ముజరబనిపై రెండేళ్ల నిషేధం మాదిరిగానే వీరిని పీఎస్ఎల్ నుంచి సస్పెండ్ చేసే అవకాశముంది.