పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లకు నోరూ ఊరించే రుచులు సిద్ధమయ్యాయి. గేమ్స్ విలేజ్‌లో సరైన ఆహారం లేక సతమతమవుతున్న మనోళ్లకు తాజ్‌మహల్, బాంబే రెస్టారెంట్లు అదిరిపోయే రీతిలో ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. విశ్వక్రీడల్లో పోటీపడుతున్న ప్లేయర్లకు తోడు చూడటానికి విచ్చేసిన ప్రేక్షకుల కోసం రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రత్యేక మెనూతో ఆకట్టుకుంటున్నారు.
పోటీల ప్రారంభానికి ముందు స్టార్ షూటర్ మను భాకర్ తమ దగ్గరే రుచి చూసిందంటూ తాజ్‌మహల్ సహ యజమాని అతిఫ్ నోమన్ చెప్పుకొచ్చాడు. పతకాలు గెలిచిన తర్వాత వస్తే..ఆమె అడిగిన డిషెస్‌ను వడ్డించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపాడు.