పారిస్ ఒలింపిక్స్‌లో మూడో డోపింగ్ కేసు నమోదైంది. అఫ్గానిస్థాన్‌కు చెందిన జూడో ప్లేయర్ మహమ్మద్ సమీమ్ ఫైజద్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడాడు. తన తొలి బౌట్ సందర్భంగా ఫైజద్ నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
1988 సియోల్ ఒలింపిక్స్ సందర్భంగా స్ప్రింటర్ బెన్ జాన్సన్ వినియోగించిన నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ ఉత్ప్రేరకం ఫైజద్ నమూనాల్లో దొరికాయి. 22 ఏండ్ల ఫైజద్ 81కిలోల తొలి బౌట్లో చేతిలో ఓడి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు.