ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన భారత పారా షట్లర్ ప్రమోద్ భగత్‌కు భారీ షాక్ తగిలింది. డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన అతడిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) 18 నెలల నిషేధం విధించినట్టు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) తెలిపింది. గత ఏడాది కాలంలో 3 సార్లు డోపింగ్ పరీక్షలకు వివరాలు వెల్లడించనందుకు గాను అతడిపై చర్యలకు దిగినట్టు బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది. ఈ నిర్ణయంతో ప్రమోద్ త్వరలో జరుగబోయే పారిస్ పారాలింపిక్స్‌కు దూరం కానున్నాడు. 2025 సెప్టెంబర్ 01 దాకా అతడిపై ఈ నిషేధం కొనసాగనుంది. పారిస్ పారాలింపిక్స్‌కు సిద్ధమవుతున్న క్రమంలో ఈ నిషేధం ఎదుర్కోవడంపై ప్రమోద్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.