భోపాల్: మేటి బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ తన టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్నాడు. జాతీయ బిలియర్డ్స్ పోటీల్లో 11వ సారి టైటిల్ గెలుచుకున్నాడు. బెస్ట్ ఆఫ్ నైన్ గేమ్స్‌లో పీఎస్‌పీబీ టీమ్మేట్ ద్రువ్ సిత్వాలాను 5-2 తేడాతో ఓడించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం సాయంత్రం 64, 42 వద్ద సిత్వాలా బ్రేక్స్ ఇచ్చాడు. అయితే దానికి బదులుగా అద్వానీ 56, 46 వద్ద బ్రేక్స్ తీసుకుని గేమ్‌ను 1-1తో టై చేశాడు. అయితే మూడవ గేమ్‌లో దూసుకువెళ్లిన సిత్వాలా 84 వద్ద బ్రేక్ తీసుకున్నాడు. ఇక నాల్గవ గేమ్‌లో సిత్వాలా చిన్న పొరపాటు వల్ల అద్వానీ పుంజుకున్నాడు. 127 వద్ద బ్రేక్ తీసుకుని గేమ్‌ను 2-2తో టై చేశాడు. ఇక అయిదవ, ఆరవ గేమ్స్‌లో 150 పాయింట్లు సాధించిన అద్వానీ మ్యాచ్‌లో లీడ్‌ను 4-2కు తీసుకువెల్లాడు. ఇక చాంపియన్‌షిప్ పాయింట్లో అద్వానీ వెనుకడుగు వేయలేదు. 148 పాయింట్ల బ్రేక్ తీసుకుని చాంపియన్‌గా నిలిచాడు.