న్యూఢిల్లీ : ఐబీఎస్ఎఫ్ ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత మేటి ఆటగాడు పంకజ్ అద్వానీ, గత చాంపియన్ ఎస్.శ్రీకృష్ణ నాకౌట్ స్థాయికి చేరుకున్నారు.
ఇరాన్‌కు చెందిన మాజీ చాంపియన్ అమీర్ సర్కోష్ కూడా నాకౌట్‌కు చేరుకున్నాడు. అద్వానీ తొలి రౌండ్లలో 4-1, 4-0తో విజయాలు నమోదు చేసుకుని గ్రూపు లో అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీకృష్ణ ఒక ఫ్రేమ్‌ను మాత్రమే కోల్పోయి నాకౌట్‌కు అర్హత సాధించాడు.