వాళ్ల బిర్యానీలకే రూ.27 లక్షలు ఖర్చయింది.. తలపట్టుకున్న పాక్ క్రికెట్ బోర్డు

ఇస్లామాబాద్: అసలే అది పాకిస్థాన్. ఆ దేశంలాగే అక్కడి క్రికెట్ బోర్డు కూడా దివాళా తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌లాంటి పెద్ద టీమ్ తమ దగ్గర ఆడటానికి రావడంతో నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని అనుకుంది. కానీ చివరి నిమిషంలో భద్రత ముప్పు అంటూ న్యూజిలాండ్ టూర్ రద్దు చేసుకొని వెళ్లిపోవడంతో ఆ ప్లాన్ కాస్తా చివరి నిమిషంలో బెడిసికొట్టింది. ఆ వెంటనే ఇంగ్లండ్ కూడా టూర్ రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోయింది. ఇదంతా ఒకెత్తయితే.. లేకలేక ఓ పెద్ద క్రికెట్ టీమ్ తమ దగ్గరికి వచ్చిందని న్యూజిలాండ్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
ఐదుగురు ఎస్పీలు, 500 మంది ఎస్ఎస్పీలను న్యూజిలాండ్ టీమ్ వెంటే ఉంచారు. వీళ్లకుతోడు పాకిస్థాన్ ఆర్మీని కూడా ఇస్లామాబాద్, రావల్పిండిలో రంగంలోకి దించారు. వాళ్లకు రోజూ రెండు పూటలా బిర్యానీలు పెట్టింది. ఇప్పుడా బిర్యానీల ఖర్చే రూ.27 లక్షలు అయిందని పీసీబీ లబోదిబోమంటోంది. అసలే టూర్లు రద్దు కావడం వల్ల తీవ్రంగా నష్టపోయామంటే.. ఇప్పుడు బిర్యానీలకే ఇంత మొత్తం చెల్లించాలా అంటూ పాక్ క్రికెట్ బోర్డు తల పట్టుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

