PAK vs BAN: బాబర్ సేనకు ఓ గెలుపు.. బంగ్లాకు ఆరో ఓటమి..
PAK vs BAN: బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన బాబర్ ఆజమ్ సేన ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది.
PAK vs BAN: వన్డే ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు ఓటముల తర్వాత పాకిస్తాన్‌కు ఓ విజయం. బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన బాబర్ ఆజమ్ సేన ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. తొలుత బంగ్లాదేశ్‌ను 204 పరుగులకే కట్టడి చేసిన పాకిస్తాన్.. లక్ష్యాన్ని 32.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఛేదనలో భాగంగా పాక్ ఓపెనర్లు ఫకర్ జమాన్ (74 బంతుల్లో 81, 3 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్లా షఫీక్ (69 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించడంతో పాక్ ఏడు వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ అఫ్గానిస్తాన్‌ను వెనక్కినెట్టి ఐదో స్థానానికి దూసుకెళ్లింది. ప్రపంచకప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు ఇది మూడో గెలుపు.
సగం పని పూర్తిచేసిన ఓపెనర్లు..
స్వల్ప ఛేదనలో పాకిస్తాన్‌కు ఓపెనర్లు తిరుగులేని ఆరంభాన్ని అందించారు. తొలి ఐదు ఓవర్లలో కాస్త నెమ్మదిగా ఆడిన జమాన్, షఫీక్‌లు తర్వాత బ్యాట్ ఝుళిపించారు. టస్కిన్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్లో మూడో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా 95 మీటర్ల సిక్సర్ బాదిన ఫకర్ జమాన్ ఇన్నింగ్స్ ఆసాంతం అదే దూకుడు కొనసాగించాడు. ముస్తాఫిజుర్ వేసిన 13వ ఓవర్లో అబ్దుల్లా మూడు ఫోర్లు కొట్టాడు. టస్కిన్ వేసిన 18వ ఓవర్లో నాలుగో బంతిని సింగిల్ తీసిన ఫఫీక్.. 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. అదే ఓవర్లో ఐదో బంతిని స్ట్రైయిట్ సిక్సర్ బాదిన జమాన్.. 51 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో ఈ జోడీ వంద పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తిచేసింది.
జమాన్ సెంచరీ మిస్..
పాకిస్తాన్‌ను విజయం దిశగా నడిపిస్తున్న ఈ జోడీని మెహిది హసన్ విడదీశాడు. అతడు వేసిన 22వ ఓవర్లో తొలి బంతికే షఫీక్.. వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 128 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. షఫీక్ నిష్క్రమించినా జమాన్ అదే దూకుడు కొనసాగించాడు. వన్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ ఆజమ్ (9) ను కూడా మెహిది హసన్ 26వ ఓవర్లో నాలుగో బంతికి పెవిలియన్ పంపాడు. అతడే తన మరుసటి ఓవర్లో ఫకర్ జమాన్‌ను కూడా ఔట్ చేసి అతడిని సెంచరీ నుంచి దూరం చేశాడు.
బాబర్ నిష్క్రమించాక వచ్చిన మహ్మద్ రిజ్వాన్ (21 బంతుల్లో 26 నాటౌట్, 4 ఫోర్లు) ఎదుర్కున్న తొలి బంతినే బౌండరీ బాదగా.. ముస్తాఫిజుర్ వేసిన 29వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి పాకిస్తాన్‌ను విజయానికి చేరువ చేశాడు. ఇఫ్తికార్ అహ్మద్ (17 బంతుల్లో 15 నాటౌట్, 2 ఫోర్లు) కూడా ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తిచేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ కోల్పోయిన వికెట్లన్నీ మెహిది హసన్ కు దక్కినవే కావడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

