PAK vs BAN: నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇక ఆ ఇద్దరి మీదే ఆశలు
PAK vs BAN: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా పాకిస్తాన్ – బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ పేసర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ విఫలమైంది.
PAK vs BAN: వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ ఆశలను వదిలేసుకున్నా తిరిగి పుంజుకుని పరువు నిలుపుకోవాలని భావిస్తున్న బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాకుల మీద షాకులిస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా పాకిస్తాన్ – బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ పేసర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ విఫలమైంది. కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న లిటన్ దాస్ (45) కూడా నిష్క్రమించడంతో ఆ జట్టు మహ్మదుల్లాతో పాటు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ మీదే భారీ ఆశలు పెట్టుకుంది. పాకిస్తాన్‌పై పోరాడే స్కోరు సాధించాలంటే ఈ ఇద్దరూ ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే బంగ్లాకు అంత మంచిది.
ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు పాక్ పేసర్లు ఆదిలోనే ట్రిపుల్ షాకిచ్చారు. షహీన్ షా అఫ్రిది వేసిన తొలి ఓవర్లో ఐదో బంతికి బంగ్లా ఓపెనర్ తాంజిద్ హసన్ (0) వికెట్లు ముందు దొరికిపోయాడు. వన్ డౌన్లో వచ్చిన నజ్ముల్ హోసెన్ శాంతో (4) కూడా అఫ్రిది వేసిన మూడో ఓవర్లో నాలుగు బంతికి ఉసామా మిర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ముష్పీకర్ రహీమ్ (5) ను హరీస్ రౌఫ్ ఆరో ఓవర్లో ఆఖరి బంతికి పెవిలియన్ పంపాడు. దీంతో బంగ్లా.. 6 ఓవర్లకే 23 పరుగులు చేసి మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో ఓపెనర్ లిటన్ దాస్.. మహ్మదుల్లాలు పట్టుదలగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ పాక్ పేస్ త్రయం (అఫ్రిది, హరీస్ రౌఫ్, మహ్మద్ వసీం) ను సమర్థంగా ఎదుర్కున్నారు. నాలుగో వికెట్‌కు 89 బంతుల్లో 79 పరుగులు జోడించిన ఈ జోడీని ఇఫ్తికార్ అహ్మద్ విడదీశాడు. ఇఫ్తికార్ వేసిన 20వ ఓవర్లో ఐదో బంతికి అఘా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 26 ఓవర్ల ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్.. 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మహ్మదుల్లా (50 నాటౌట్), షకిబ్ అల్ హసన్ (4 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

