Bangladesh: కథ ముగిసె.. కల చెదిరె..! వరల్డ్ కప్ నుంచి బంగ్లా ఔట్
Bangladesh: వన్డే వరల్డ్ కప్‌లలో పసికూన ట్యాగ్‌ను తొలగించుకుని బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కథ ముగిసింది. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆ జట్టు సెమీస్ చేరే జట్ల జాబితాలో లేకున్నా కనీసం పెద్ద జట్లకు షాకులైనా ఇస్తుందేమోనని అంతా భావించారు. కానీ..
Bangladesh: గడిచిన రెండేండ్లుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో పాటు భారత్‌కు షాకులిస్తూ.. స్వదేశంలో సిరీస్‌లు కాపాడుకోవడంతో పాటు వన్డే వరల్డ్ కప్‌లో పసికూన ట్యాగ్‌ను తొలగించుకుని బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కథ ముగిసింది. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆ జట్టు సెమీస్ చేరే జట్ల జాబితాలో లేకున్నా కనీసం పెద్ద జట్లకు షాకులైనా ఇస్తుందేమోనని అంతా భావించారు. గత ఏడాదికాలంగా ఆ జట్టు ప్రదర్శన చూస్తే అదంతా పెద్ద కష్టమేమీ కాదు. కానీ బంగ్లాదేశ్ అంచనాలను తలకిందులు చేస్తూ అత్యంత పేలవ ప్రదర్శనతో వరల్డ్ కప్ – 2023లో సెమీస్ రేసుతో పాటు వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.
పాకిస్తాన్‌తో ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిన బంగ్లాదేశ్.. వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ మెగా టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గి ఆరింటిలో ఓడింది. ఒక్క అఫ్గానిస్తాన్ పై తప్ప మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ ఓడిన బంగ్లా.. ఈ టోర్నీలో తమ మిగిలిన మ్యాచ్‌లను శ్రీలంక, న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లలో గెలిస్తే ఆ జట్టు పరువైనా దక్కించుకుంటుంది.
నిండా ముంచిన విభేదాలు..
బంగ్లాదేశ్ జట్టును విభేదాలు నిండా ముంచాయి. టోర్నీ ప్రారంభానికి ముందే స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్, కెప్టెన్ షకిబ్ అల్ హసన్ మధ్య విభేదాలు తలెత్తాయి. తాను కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని తమీమ్ చెప్పడం దానికి షకిబ్ ససేమిరా ఒప్పుకోకపోవడంతో బంగ్లా మాజీ సారథి వన్డే వరల్డ్ కప్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. దానికి తోడు బంగ్లా స్టార్ బౌలర్ ఎబాదత్ హోసేన్ గాయంతో ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఆసియా కప్‌లో అయినా కాస్తో కూస్తో రాణించిన బంగ్లా.. వరల్డ్ కప్ లో మాత్రం ఆ స్థాయి ఆటను కూడా ప్రదర్శించలేకపోయింది. ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన మహ్మదుల్లా.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలున్నాయని చెప్పకనే చెప్పాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో ఆటగాళ్ల మధ్య సఖ్యత కొరవడిందన్న వార్తలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
BANGLADESH OUT OF THE WORLD CUP 2023…..!!!!! pic.twitter.com/uQ9k3x5lGN
— Johns. (@CricCrazyJohns) October 31, 2023
వ్యక్తిగత విభేదాలు ఆటగాళ్ల ప్రదర్శన మీద తీవ్రంగా ప్రభావం చూపాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో దుమ్మురేపిన లిటన్ దాస్, ఆసియా కప్‌తో పాటు అంతకుముందు రాణించిన మెహిది హసన్ మిరాజ్, నజ్ముల్ హోసెన్ శాంతోలు వరల్డ్ కప్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అతడు బ్యాట్‌తో పాటు బంతితోనూ విఫలమయ్యాడు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్పీకర్ రహీమ్దీ అదే బాట. బౌలర్లలో ముస్తాఫిజుర్ వంటి బౌలర్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆటగాళ్ల సమిష్టి వైఫల్యాల ఫలితంగా ఈ వరల్డ్ కప్‌లో కూడా బంగ్లాదేశ్‌కు నిరాశ తప్పలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

