Pakistan team : ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ సాధించి కూడా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైన పాకిస్థాన్ రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. మంగళవారం నుంచి ముల్తాన్ వేదికగానే రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. అందుకే జట్టు కూర్పు విషయంలో సెలక్షన్ కమిటీ చాలా సీరియస్‌గా ఉంది.
ఈ క్రమంలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలి టెస్టు ఓటమి అనంతరం పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్, కోచ్ గిలెస్పీ బాబర్ అజామ్‌కు మద్దతు ఇచ్చారు. కానీ సెలక్షన్ కమిటీలో మిగిలిన సభ్యులు బాబర్ అజామ్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలీందార్, ఆఖిబ్ జావెద్, అజర్ అలీలు బాబర్‌ను తప్పించాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది.
2022 డిసెంబర్ తర్వాత నుంచి బాబార్ అజామ్ టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్‌పై కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. 2022 నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో 527 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3997 పరుగులు చేశాడు. కాగా, బాబర్ అజామ్ ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు.