The Hundred League : పొట్టి క్రికెట్లో సంచలన విజయాలు మామూలే. కానీ, ఒకేఒక జట్టు వరుసపెట్టి టైటిళ్లు గెలవడం మాత్రం దాదాపు అసాధ్యమే. అయితే.. ఒక జట్టు మాత్రం నభూతో నభవిష్యత్ అనేలా.. కొన్ని తరాలు నిలిచిపోయే ప్రదర్శనతో ఔరా అనిపించింది. ‘ది హండ్రెడ్ లీగ్’ (The Hundred League)లో తమ ఆధిపత్యాన్ని చాటుతూ వరుసగా మూడో ఏడాటి టైటిల్ కొల్లగొట్టింది. ప్రత్యర్థుల పాలిటి సింహస్వప్నంలా నిలుస్తూ హ్యాట్రిక్ ట్రోఫీతో చెక్కుచెదరని రికార్డు నెలకొల్పింది ఓవల్ ఇన్విన్సిబుల్స్ (Oval Invincibles). వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మాదిరిగా ఈ వంద బంతుల టోర్నీలో అజేయ శక్తిగా ఎదిగిన ఓవల్ జట్టు విజయ ప్రస్థానమిది.
ఐపీఎల్ స్ఫూర్తిగా ఇంగ్లండ్ గడ్డపై ‘ది హండ్రెడ్ లీగ్’ ఏమంట మొదలైందోగానీ.. ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు టైటిళ్ల వేటతో దడపుట్టిస్తోంది. 2023 ఆరంభ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన ఓవల్.. నిరుడు కూడా దుమ్మురేపి ట్రోఫీని తన్నుకుపోయింది. ఈ ఏడాది కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగి హ్యాట్రిక్ టైటిల్‌తో నవ చరిత్రకు నాంది పలికింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ (Trent Rockets)కు సామ్ బిల్లింగ్స్ నేతృత్వంలోని ఓవల్ టీమ్ చెక్ పెట్టింది. దాంతో తొలిసారి విజేతగా నిలవాలనుకున్న రాకెట్ జట్టు కల కలగానే మిగిలిపోయింది.
‘You’re never going to be better than the IPL’ – Jordan Cox wants the Hundred to stay a 100-ball competition to stand out from the crowd 🗣️ pic.twitter.com/9PE4H1JJG5
— ESPNcricinfo (@ESPNcricinfo) September 1, 2025
మొదట విల్ జాక్స్(72) విధ్వంసంతో 5 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. దాంతో, రాకెట్స్ బ్యాటర్లు లక్ష్యాన్ని తేలికగా ఛేదిస్తారని.. ఈసారి ఓవల్ ఇన్విసిబుల్స్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సిందే అని అనుకున్నారంతా. కానీ బౌలింగ్‌లో నాథన్ సోవ్‌టర్ (3-250)తో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. దాంతో, రాకెట్స్ టీమ్‌ను 26 పరుగుల తేడాతో మట్టికరిపించిన ఓవల్ జట్టు ముచ్చటగా మూడోసారి ఛాంపియన్‌గా మురిసిపోయింది.
పొట్టి క్రికెట్లో వరుసగా మూడు టైటిళ్లు గెలుపొందిన రెండో జట్టుగా ఓవల్ ఇన్విసిబుల్స్ అవతరించింది. ఈ జట్టు కంటే ముందు కరీబియన్ టీ20 కప్‌లో ట్రిన్డాడ్ టొబాగో (Trinidad & Tobago) ఇలానే హ్యాట్రిక్ టైటిళ్లతో రికార్డు నెలకొల్పింది. దినేశ్ రామ్‌దిన్ నేతృత్వంలోని ట్రిన్డాడ్ 2011, 2012, 2013లో ఛాంపియన్‌గా నిలిచింది.