న్యూఢిల్లీ: అస్సాం అథ్లెట్ అమ్లాన్ బొర్గోహై 100 మీటర్ల పరుగులో 10.25 సెకండ్లతో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పా డు.రాయ్‌బరేలిలో జరుగుతున్న అంతర్ రైల్వే అథ్లెటిక్ మీట్లో అమ్లాన్ ఈ రికార్డు నెలకొల్పాడు.అమియ కుమార్ మాలిక్ పేరిట ఉన్న (10.26సె.) రికార్డును అమ్లాన్ తిరగరాశాడు. దీంతో 24 ఏళ్ల అమ్లాన్ స్ప్రింట్ ఈవెంట్లు రెండింటిలో (100 మీ., 200 మీ.) జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నట్టయింది.