న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్-2023లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. టీమ్ హయ్యెస్ట్ స్కోర్స్, హయ్యెస్ట్ సెంచరీస్, ఫాస్టెస్ట్ సెంచరీస్ ఇలా వరుసగా రికార్డుల మోత మోగుతోంది. తాజాగా న్యూజిలాండ్ తరఫున వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదైంది. న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 77 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ప్రపంచకప్ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. దీనికంటే ముందు ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా రచిన్ రవీంద్ర పేరిటనే ఉన్నది. ఇదే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర 82 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఇప్పుడు తన రికార్డును తనే బద్దలు కొట్టాడు.