హైదరాబాద్: కేబీడీ జూనియర్స్ సీజన్-4లో హైదరాబాద్ విజేతగా ఓబుల్‌రెడ్డి స్కూల్ నిలిచింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో ఓబుల్‌రెడ్డి స్కూల్ 25-14తో సిస్టర్ నివేదిత పాఠశాలపై అద్భుత విజయం సాధించింది. టైటిల్ దక్కించుకున్న ఓబుల్‌రెడ్డి స్కూల్ నేషనల్స్‌కు అర్హత పొందింది.
వివిధ నగరాల నుంచి ఎంపికైన 12 జట్లతో జాతీయ స్థాయిలో ఫైనల్ నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన వేదిక, తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.