Henry Nicholls | బాల్ ట్యాంపరింగ్ వివాదం.. కివీస్ క్రికెటర్‌కు లైన్ క్లియర్
Henry Nicholls : బాల్ ట్యాంపరింగ్(Ball Tampering) వివాదంలో చిక్కుకున్న న్యూజిలాండ్ టెస్టుఆటగాడు హెన్నీ నికోల్స్(Henry Nicholls)కు భారీ ఊరట లభించింది. న్యూజిలాండ్ క్రికెట్ అతడిని నిర్దోషిగా తేల్చింది. శనివారం నికోల్స్ స్వతంత్ర కమిషనర్ ముందు హాజరయ్యాడు. అతడి వాదనలు విన్న కమిషనర్లు...
Henry Nicholls : బాల్ ట్యాంపరింగ్(Ball Tampering) వివాదంలో చిక్కుకున్న న్యూజిలాండ్ టెస్టుఆటగాడు హెన్నీ నికోల్స్(Henry Nicholls)కు భారీ ఊరట లభించింది. న్యూజిలాండ్ క్రికెట్ అతడిని నిర్దోషిగా తేల్చింది. శనివారం నికోల్స్ స్వతంత్ర కమిషనర్ ముందు హాజరయ్యాడు. అతడి వాదనలు విన్న కమిషనర్లు లీ రాబిన్సన్, జాన్ గ్రీన్వుడ్, మ్యాచ్ అంపైర్లు కిమ్ కాటన్, డెరెక్ వాకర్, కంటెర్‌బరీ కోచ్ పీటర్ ఫుల్టన్.. నికోల్స్ ఏమంత పెద్ద నేరానికి పాల్పడలేదని, అతడిపై చర్యలు తీసుకునేందుకు సరైన ఆధారం లేదని స్పష్టం చేశారు. దాంతో, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు నికోల్స్‌కు లైన్ క్లియర్ అయింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మ్యాచ్‌లో నికోల్స్ న్యూజిలాండ్ క్రికెట్(Newzealand Cricket) నియమనిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో అతడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. కాంటెర్బరీ ఆటగాడైన నికోల్స్ ఆక్లాండ్ జట్టులో మ్యాచ్ జరుగుతుండగా ఉద్దేశపూర్వకంగా బంతిని హెల్మెట్‌కేసి రుద్దాడు.
Starting the season strong! Two hundreds in two matches for @HenryNicholls27 marking his 16th First-Class hundred. Follow LIVE coverage of Plunket Shield Round 3 | https://t.co/cUuHWEeXyK #PlunketShield #CricketNation #Cricket 📷 = @PhotosportNZ pic.twitter.com/CSyoBZHLGl
— BLACKCAPS (@BLACKCAPS) November 7, 2023
బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం వీడియోలో రికార్డయింది. దాంతో, బాల్ ట్యాంపరింగ్ నేరానికి పాల్పడిన అతడిపై న్యూజిలాండ్ క్రికెట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నికోల్స్ ఇప్పటిరకూ న్యూజిలాండ్ తరఫున 54 టెస్టులు ఆడాడు. ఒక డబుల్ సెంచరీ, 9 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు కొట్టాడు. డు టెస్టుల సిరీస్ కోసం టిమ్ సౌథీ నేతృత్వంలోని కివీస్ నవంబర్ 21న బంగ్లాదేశ్‌కు బయలుదేరనుంది.
న్యూజిలాండ్ టెస్టు స్క్వాడ్ : టిమ్ సౌథీ(కెప్టెన్), కేన్ విలియమ్సన్, టామ్ బండెల్(వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైలీ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిఫ్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, విల్ యంగ్.
ఇవి కూడా చదవండి
-
Team India | దీపావళి సంబురాల్లో భారత జట్టు.. ఫొటోలు వైరల్
-
Diwali 2023 | దీపావళి పర్వదినాన లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు.. దాని వెనుక ఇతివృత్తం ఏంటి?
-
CM KCR | నాడు ప్రత్యర్థులు.. నేడు ఫాలోవర్లు.. బీఆర్ఎస్ అధినేతకు జై కొట్టిన హేమాహేమీలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

