CM KCR | నాడు ప్రత్యర్థులు.. నేడు ఫాలోవర్లు.. బీఆర్ఎస్ అధినేతకు జై కొట్టిన హేమాహేమీలు
CM KCR | ‘యుద్ధంలో గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. శత్రువును ఓడించడం’ జల్సా సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. రాజకీయాల్లో అపర చాణక్యుడు కేసీఆర్ కూడా సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తారు. ‘ప్రజా క్షేత్రంలో యుద్ధం అంటే ప్రత్యర్థులను ఓడించడం కాదు.. మనం గెలవడం.. ప్రత్యర్థుల మనసులను గెలవడం’ అంటారాయన.
CM KCR | ‘యుద్ధంలో గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. శత్రువును ఓడించడం’ జల్సా సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. రాజకీయాల్లో అపర చాణక్యుడు కేసీఆర్ కూడా సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తారు. ‘ప్రజా క్షేత్రంలో యుద్ధం అంటే ప్రత్యర్థులను ఓడించడం కాదు.. మనం గెలవడం.. ప్రత్యర్థుల మనసులను గెలవడం’ అంటారాయన. దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కేసీఆర్ ఎందరో హేమాహేమీలను మట్టికరిపించారు.. మరెందరినో తనతో కలుపుకొన్నారు.. నాడు తనతో పాటు ఉద్యమంలో నడిచేలా చేశారు.. నేడు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చేస్తున్నారు.
కేసీఆర్ గెలుపును చూసి ప్రత్యర్థులు సైతం ఆయనకు జై కొట్టాల్సిందే. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీ చేసిన వారిలో ఎనిమిది మంది మహామహులు ఆ తర్వాత కేసీఆర్‌తో కలిసిపోయారు. కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీలో చేరి తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. వారేమి ఆశామాషీ వ్యక్తులు కాదు. రాజకీయాల్లో అందరూ తమదైన ముద్ర వేసినవారే. 1983లో సిద్దిపేట బీజేపీ అభ్యర్థిగా కేసీఆర్‌పై పోటీ చేసిన నిమ్మ నర్సింహారెడ్డి నుంచి మొదలుకొని 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వంటేరు ప్రతాప్‌రెడ్డి వరకు అందరూ కేసీఆర్‌తో కలిసి నడుస్తున్నారు.
నిమ్మ నర్సింహారెడ్డి…
1983లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిమ్మ నర్సింహారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్.. కాంగ్రెస్ అభ్యర్థి, తన రాజకీయ గురువు అనంతుల మదన్మోహన్ చేతిలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అనంతర కాలంలో తెలంగాణ సాధన కోసం నిమ్మ నర్సింహారెడ్డి సైతం కేసీఆర్ వెంట నడిచారు. టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్నప్పుడు కేసీఆర్‌తో పాటు ఉన్న కొద్దిమంది మిత్రులు, మేధావుల్లో నిమ్మ నర్సింహారెడ్డి కూడా ఒకరు.
మారెడ్డి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ సభ్యత్వానికి, శాసనసభకు, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. దీంతో 2001లో సిద్దిపేట ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేసీఆర్ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కొద్దికాలానికే మారెడ్డి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో చేరారు.
జిల్లా శ్రీనివాస్
టీఆర్ఎస్ను స్థాపించిన తర్వాత 2004లో సిద్దిపేట నుంచి కేసీఆర్ పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థిగా జిల్లా శ్రీనివాస్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ 44,668 భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత జిల్లా శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరారు.
ఎం స్వామిచరణ్
1999లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ తరఫున ఎం స్వామిచరణ్ పోటీ చేశారు. ఆయనపై కేసీఆర్ 27,555 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మలిదశ ఉద్యమం మొదలయ్యాక టీఆర్ఎస్లో చేరారు.
ఎల్ రమణ
2006లో టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కేసీఆర్‌పై టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత ఎల్ రమణ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2,10,582 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. 2021లో బీఆర్ఎస్లో చేరిన ఎల్ రమణకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
వంటేరు ప్రతాప్ రెడ్డి
2014, 2018లోనూ గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి 2019లో టీఆర్ఎస్లో చేరారు. ప్రతాప్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కేసీఆర్ నియమించారు.
చాగన్ల నరేంద్రనాథ్
2014లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌పై బీజేపీ తరఫున చాగన్ల నరేంద్రనాథ్ బరిలో నిలిచారు.. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం టీఆర్ఎస్లో చేరారు.
…? సూర్యకిరణ్ తోగటి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

