టెల్ అవీవ్ : టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్ టెల్ అవీవ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫైనల్లో జొకోవిచ్ 6-3, 6-4 స్కోరుతో క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిచ్‌ను ఓడించాడు. ఈ సీజన్లో జొకోవిచ్‌కు ఇది మూడో టైటిల్. కాగా డబుల్స్‌లో టాప్‌సీడ్ ద్వయం బోపన్న-మిడిల్‌కూప్ టైటిల్ దక్కించుకుంది. గంట 12 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో వారు 6-2, 6-4తో మూడో సీడ్ గొంజాలెజ్-మోల్టెనిలపై విజయం సాధించారు.