ముల్తాన్: పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య శనివారం మొదలైన రెండో టెస్టులో ఒక్క రోజే 20 వికెట్లు నేలకూలాయి. తొలుత నోమ న్ అలీ(6/41) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే కుప్పకూలింది. అలీ స్పిన్ విజృంభణతో 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను గుడకేశ్ మోతీ(55), జోమెల్ వారికన్(36 నాటౌట్), కీమర్ రోచ్ (25) ఆదుకున్నారు.
టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి పాక్ స్పిన్నర్‌గా అలీ రికార్డుల్లోకెక్కాడు. ఆ తర్వాత వారికన్(4/43), మోతీ(3/49) విజృంభణతో పాక్ 154 పరుగులకు పరిమితమైంది. రిజ్వాన్(49) ఆకట్టుకున్నాడు.