హైదరాబాద్, ఆట ప్రతినిధి: కూచ్ బెహార్ అండర్-19 టోర్నీలో హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ నితిన్‌సాయి యాదవ్ సత్తాచాటాడు. గ్రూపు-డిలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో నితిన్(101 నాటౌట్, 2/37) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 161 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత అండర్-19 జట్టుకు ఎంపికైన రిశిత్రెడ్డి స్థానంలో వచ్చిన నితిన్ ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. నితిన్‌తో పాటు ధీరజ్గౌడ్(101), భరద్వాజ్(90), రిశికేష్(71) రాణించడంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌ను 461/7 వద్ద డిక్లేర్ చేసింది. 318 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన త్రిపుర 151 పరుగులకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ బోనస్ సహా ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది.