Nikhat Zareen | తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అదరగొట్టింది. వరుసగా అన్ని బౌట్లలో విజయం సాధిస్తూ టైటిల్ను సొంతం చేసుకున్నది. ఇప్పటివరకు అన్ని బౌట్లను కపక్షంగా గెలుస్తూ వచ్చిన నిఖత్ జరీన్.. ఫైనల్లో కూడా అదే ఊపును కొనసాగించింది. ఫైనల్స్లో రైల్వేస్కు చెందిన అనామికను 4-1 తేడాతో ఓడించి జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నది.
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ 2022 ఏడాదిని ఘనంగా ముగించింది. మధ్యప్రదేశ్ భోపాల్ వేదికగా జరుగుతున్న జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో 50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్ జరీన్.. ప్రత్యర్థి అనామికకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పోటి మొదలైనప్పటి నుంచి దూకుడుగా బాక్సింగ్ చేస్తూ అనామికకు గట్టిపోటీనిచ్చింది. ఒక బౌట్ గెలిచినప్పటికీ అనామికకు నిఖత్ చేతిలో ఓటమి తప్పలేదు. 4-1 తేడాతో నిఖత్ అనామికను ఓడించి టైటిల్ను చేజిక్కించుకున్నది. కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిళ్లను గెలుచుకుని నిఖత్ మంచి ఫామ్లో ఉన్నది.