Nick Kyrgios | ఇండియన్ వెల్స్, మియామీ ఓపెన్ నుంచి నిక్ కిర్గియోస్ ఔట్.. కారణం ఏంటంటే..?
ఆస్ట్రేయాకు చెందిన నిక్ కిర్గియోస్ రెండు టోర్నీలకు దూరం కానున్నాడు. మోకాలి సమస్య కారణంగా అతను వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇండియన్ వెల్స్ మాస్టర్స్, మియామీ ఓపెన్ల నుంచి వైదొలిగాడు. వరల్డ్‌లో 19వ ర్యాంకులో ఉన్న కిర్గియోస్ ఈ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కిర్గియోస్ మార్చిలో టెన్నిస్ కోర్టులో దిగుతాడని అతని మేనేజర్ డానియెల్ హార్స్ఫాల్ వెల్లడించాడు.
Nick Kyrgios : ఆస్ట్రేయాకు చెందిన నిక్ కిర్గియోస్ రెండు టోర్నీలకు దూరం కానున్నాడు. మోకాలి సమస్య కారణంగా అతను వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇండియన్ వెల్స్ మాస్టర్స్, మియామీ ఓపెన్ల నుంచి వైదొలిగాడు. జనవరిలో ఎడమ మోకాలికి కిర్గియోస్ సర్జరీ చేసుకున్నాడు. దాంతో కోలుకునేందుకు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు.
ఈ రెండు టోర్నమెంట్లలో ఆడడం లేదని అతను ఈ రోజు వెల్లడించాడు. వరల్డ్‌లో 19వ ర్యాంకులో ఉన్న కిర్గియోస్ ఈ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నిక్ కిర్గియోస్ మార్చిలో మళ్లీ టెన్నిస్ కోర్టులో దిగుతాడని అతని మేనేజర్ డానియెల్ హార్స్ఫాల్ వెల్లడించాడు.
తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్
గత ఏడాది రెండో అర్ధభాగంలో కిర్గియోస్ కెరీర్లోనే బెస్ట్ టెన్నిస్ ఆడాడు. ఈ యంగ్ టెన్నిస్ సంచలనం తొలిసారి గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్) ఫైనల్ చేరాడు. అయితే.. ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. ఆగష్టులో ఏటీపీ 500 సిటీ ఓపెన్ టైటిల్ గెలిచాడు. అంతేకాదు సెప్టెంబర్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతను మోకాలి నొప్పి కారణంగా జపాన్ ఓపెన్ నుంచి వైదొలిగాడు.
ఇవి కూడా చదవండి
Glenn McGrath | ఆస్ట్రేలియా ఆ ఇద్దరిపై ఎక్కువగా ఆధారపడుతోంది : మాజీ ఫాస్ట్ బౌలర్
Jasprit Bumrah | ముంబై ఇండియన్స్‌కు పెద్ద షాక్.. ఐపీఎల్‌కు బుమ్రా దూరం..! కారణం అదే..?
Rishabh Pant | జీవితాన్ని కొత్తగా చూస్తున్నా.. చిన్న చిన్న పనుల్లో సంతోషం వెతుక్కుంటున్నా : పంత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

