Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
Nic Maddinson: ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నిక్ మ్యాడిన్సన్ (Nic Maddinson) నిరాశపరిచాడు. క్యాన్సర్‌ను జయించి పునరాగమనం మ్యాచ్‌లో భారీ అంచనాల నడుమ క్రీజులోకి వచ్చిన అతడు అనూహ్యంగా డకౌటయ్యాడు.
Nic Maddinson: ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నిక్ మ్యాడిన్సన్(Nic Maddinson) నిరాశపరిచాడు. పునరాగమనం మ్యాచ్‌లో భారీ అంచనాల నడుమ క్రీజులోకి వచ్చిన అతడు అనూహ్యంగా డకౌటయ్యాడు. దక్షిణాఫ్రికాతో డర్బన్ టెస్టులో స్టీవ్ స్మిత్ జతగా ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు 33 బంతులాడి సున్నాకే వెనుదిరిగాడు. దాంతో, శుభారంభం దక్కుతుందని ఆశించిన ఆసీస్‌ను అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు చేయని అతడు దురదృష్టానికి కేరాఫ్ అనిపించొచ్చు. కానీ, అతడు జీవితాన్ని గెలిచిన విజేత. క్యాన్సర్‌ను జయించి మళ్లీ క్రికెట్‌ను కొనసాగించిన మ్యాడిన్సన్ గడ్డు కాలాన్ని ఎలా దాటాడంటే..?
డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్‌గా ఆడిన నిక్ మ్యాడిసన్ జీవితంలో మాత్రం పోరాడి గెలిచాడు. పునరాగమనం మ్యాచ్‌లో డకౌటైన అతడి క్యాన్సర్ జర్నీ కన్నీళ్లు తెప్పిస్తుంది. గతేడాది ఆరంభంలో మ్యాడిసన్ శరీరంలో ఓ కణతి ఏర్పడింది. అనుమానంతో వైద్య పరీక్షలు చేయించగా టెస్టిక్యులర్ క్యాన్సర్ అని తేలింది. దాంతో.. అతడు వెంటనే సర్జరీ చేయించుకున్నాడు. కానీ, కొన్ని వారాలకు మళ్లీ స్కానింగ్ పరీక్షల్లో.. క్యాన్సర్ కణతి లింఫ్ గ్రంథులకు, ఊపిరితిత్తులకు పాకిందనే విషయం తెలిసి అతడు కంగుతిన్నాడు.
Nic Maddinson found a lump in his body earlier last year.
Scans revealed testicular cancer, and he had surgery immediately to remove it. But further tests seven weeks later showed the cancer had spread to parts of his abdominal lymph nodes and lung.
Maddinson’s wife, Bianca, was also pregnant with their second child when he began chemotherapy and had to quit her job as a dentist to look after their toddler son while Maddinson underwent treatment.
He would be at the hospital from about 11am to 4pm. Then a sleep. Then he would force himself to have dinner. Then he would sleep until about 1am, but sometimes he would stay awake until 6am.
He completed his chemotherapy on July 14. He had to wait another two months before he was cleared to resume full training.
After the birth of his second son, Wilder, he is grateful to be healthy again and has urged others to get checked if they notice anything abnormal.
Today, Nic Maddinson plays Test cricket again.
He returns to first-class cricket after 579 days, having last played in March 2025. It is the longest period an Australian has gone without playing first-class cricket before a men’s Test match.
Never give up.
— Cricinfo (@cricinfo) October 9, 2026
ఆ సమయంలో.. అతడి భార్య బియన్కా కడుపులో రెండో బిడ్డను మోస్తోంది. వృత్తిరీత్యా దంత వైద్యురాలైన తను.. మ్యాడిన్సన్ కోసం తన ఉద్యోగం మనేసింది. మొదటి బిడ్డ బాగోగులు చూసుకుంటూనే భర్తకు కీమోథెరపీ చేయించింది తను. జూలై వరకు కీమో.. ఆపై మరో రెండు నెలల్లో అతడు కోలుకున్నాడు. ఇక రెండో బిడ్డ పుట్టిన వేళా విషేషం కావొచ్చు.. మ్యాడిన్సన్ ఆరోగ్యం మరింత మెరుగుపడింది. దాంతో.. అతడు మళ్లీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. కట్ చేస్తే.. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ లెఫ్ట్ హ్యాండర్ టెస్టు జట్టులోకి వచ్చాడు.
భారత్‌పై తొలి టీ20
స్పిన్ బౌలర్ కూడా అయిన నిక్ మ్యాడిన్సన్ 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్‌పై టీ20తో పొట్టి ఫార్మాట్లో అతడి కెరీర్ మొదలైంది. ఆపై మూడేళ్లకు టెస్టు కలను సాకారం చేసుకున్నాడు. 2016 నవంబర్ 24వ తేదీన దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2014లో తొలి మ్యాచ్ ఆడాడీ ఆసీస్ బ్యాటర్. సఫారీలపై మొదటి టెస్టు ఆడిన మ్యాడిన్సన్ నిరుడు క్యాన్సర్ చికిత్స తర్వాత మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బరిలోకి దిగాడు.
దేశవాళీలో మెరుగైన ప్రదర్శన కారణంగా డర్బన్ టెస్టుకు అతడిని ఎంపిక చేశారు సెలెక్టర్ల. దాంతో.. 9 ఏళ్ల 286 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మ్యాడిన్సన్ అంతర్జాతీయ రెడ్ బాల్ క్రికెట్ ఆడాడు. తద్వారా అత్యధిక విరామం తర్వాత టెస్టుల్లో ఆడిన ఆసీస్ రెండో ఆటగాడిగా 34 ఏళ్ల మ్యాడిన్సన్ గుర్తింపు సాధించాడు.
Wowee… Nic Maddinson copped an absolute ripper on Test debut and Kagiso Rabada was sure to let him know about it! https://t.co/mdUAQUpctv
— cricket.com.au (@cricketcomau) November 25, 2016
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
Mayookha | ‘మయూఖ’ మూవీ రివ్యూ.. భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్!
‘పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలి’
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

