SA vs AUS : టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ దక్షిణాఫ్రికా (South Africa) జోరు కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన సఫారీ టీమ్.. వన్డే ట్రోఫీని మాత్రం పట్టేసింది. తొలి వన్డేలో ఆసీస్‌కు షాకిచ్చిన తెంబ బవుమా సేన రెండో మ్యాచ్‌లోనూ పంజా విసిరింది. కుర్రాళ్లు అర్ధ శతకాలతో రెచ్చిపోయి భారీ స్కోర్ అందిస్తే.. ఆపై సీనియర్ పేసర్ లుంగి ఎంగిడి నిప్పులు చెరిగాడు. కంగారూ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. దాంతో, 84 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది ప్రొటీస్ జట్టు.
ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా ఆడుతున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ గెలుపొందింది. తొలి వన్డేలో సూపర్ విక్టరీతో కంగారూలకు షాకిచ్చిన సఫారీలు రెండో మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్ షోతో ఆసీస్ ఆట కట్టించారు. మొదట మాథ్యూ బ్రీట్జ్(88), ట్రిస్టన్ స్టబ్స్ (74)ల మెరుపు హాఫ్ సెంచరీలతో ప్రొటిస్ జట్టు 277 పరుగులు చేసింది. భారీ ఛేదనలో ఆస్ట్రేలియా ఆది నుంచి తడబడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (6), మిచెల్ మార్ష్(18) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత ఎంగిడి నిప్పులు చెరగడంతో ఆసీస్ మిడిలార్డర్ కుప్పకూలింది.
That was FIRE 🔥 pic.twitter.com/KA5gVgAvMU
— ESPNcricinfo (@ESPNcricinfo) August 22, 2025
మార్నస్ లబూషేన్ (1)ను ఔట్ చేసిన ఈ స్పీడ్‌స్టర్ అర్ధ శతకంతో చెలరేగిన జోష్ ఇంగ్లిస్(87)ను వెనక్కి పంపి కంగారూలను ఓటమి అంచున నిలిపాడు. టెయిలెండర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరడంతో ఆసీస్ 37.4 ఓవర్లలో 193కే ఆలౌటయ్యింది. దాంతో, 84 రన్స్‌తో గెలుపొందిన మర్క్రమ్ సేన మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ పట్టేసింది. ఆస్ట్రేలియాపై సఫారీలకు ఇది వరుసగా ఐదో వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. సంచలన బౌలింగ్‌తో జట్టును గెలిపించిన ఎంగిడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఆగస్టు 24 ఆదివారం జరుగనుంది.
South Africa were looking good for a 300+ score, but Australia pull things through and carry the momentum 👏
Who’s got this?
🔗 https://t.co/nKoxSA42XV pic.twitter.com/ZPcD1J8NuI
— ESPNcricinfo (@ESPNcricinfo) August 22, 2025