Newzealand | కన్నబిడ్డలతో మైదానంలోకి.. వందో టెస్టులో అపూర్వ దృశ్యం.. వీడియో
Newzealand : న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్(Kane Williamson), టిమ్ సౌథీ(Tim Southee) లో కెరీర్లో మరో మైలురాయిని అధిగమించారు. కొన్నేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న ఈ ఇద్దరూ 'వందో టెస్టు' ...
Newzealand : న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్(Kane Williamson), టిమ్ సౌథీ(Tim Southee) లో కెరీర్లో మరో మైలురాయిని అధిగమించారు. కొన్నేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న ఈ ఇద్దరూ ‘వందో టెస్టు’ ఆడుతున్నారు. స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న రెండో టెస్టు విలియమ్సన్, సౌథీలకు నూరో మ్యాచ్. ఈ సందర్భంగా ఇరువురు ఆటగాళ్లు తమ కన్నబిడ్డలతో స్టేడియానికి వచ్చారు.
జట్టు సభ్యులంతా చప్పట్లు కొడుతుండగా తమ పిల్లల్ని చంకనెత్తుకొని మైదానంలోకి అడుగుపెట్టారు. ఈ అపూర్వ దృశ్యానికి సంబంధించిన వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ ఆన్లైన్ పెట్టింది.
A special moment for the Southee and Williamson families 🏏 #NZvAUS #TimKane100 pic.twitter.com/C8sFgXoeMv
— BLACKCAPS (@BLACKCAPS) March 7, 2024
స్పీడ్‌స్టర్ సౌథీ 2008లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. కొత్త బంతితో నిప్పులు చెరిగే సౌథీ అనతికాలంలోనే న్యూజిలాండ్ ప్రధాన పేసర్‌గా ఎదిగాడు. మరోవైపు రికార్డుల వీరుడు విలియమ్సన్ 2010లో తొలి మ్యాచ్ ఆడాడు. ప్రపంచంలోని మేటి బ్యాటర్ అయిన కేన్ మామ.. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై మూడు శతకాలతో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(Steven Smith) రికార్డు సమం చేశాడు. 32 టెస్టు సెంచరీలతో ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన ఈ మాజీ సారథి 50 సగటుతో 8,500 రన్స్ కొట్టాడు.
కేన్ విలియమ్సన్

తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన కివీస్.. రెండో మ్యాచ్‌లోనూ తడబడింది. పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఇన్నింగ్స్ మొదలెట్టిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది.
❌ Usman Khawaja
❌ Cameron Green
❌ Travis HeadThree huge strikes by Matt Henry 🔥 Australia are 107/4 in Christchurch 👉 https://t.co/H62J4pYYhP #NZvAUS pic.twitter.com/eIIRTO7eVA
— ESPNcricinfo (@ESPNcricinfo) March 8, 2024
కివీ పేసర్ మ్యాట్ హెన్రీ తన పదునైన బంతులతో కంగారూ టాపార్డర్‌ను డగౌట్‌కు చేర్చాడు. దాంతో, మార్నస్ లబూషేన్( 38నాటౌట్), నాథన్ లియాన్(0)లు జట్టును గట్టెక్కించే పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
- Odela 2 | ఓదెల 2లో శివశక్తిగా తమన్నా.. మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్ వైరల్
- Maha Shivratri: దేశవ్యాప్తంగా శివార్చనలు, అభిషేకాలు.. భక్తులతో నిండిపోయిన ఆలయాలు
- CM Revanth Reddy | మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, హక్కులు దక్కాలి: సీఎం రేవంత్ రెడ్డి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

