Odela 2 | ఓదెల 2లో శివశక్తిగా తమన్నా.. మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్ వైరల్
Odela 2 | బ్లాక్ బస్టర్ సినిమా ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్ ఓదెల 2 (Odela 2) వస్తోందని తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే ఓదెల 2 షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారు.
Odela 2 | సంపత్ నంది (Sampath Nandi)-హెబ్బాపటేల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఓదెల రైల్వే స్టేషన్. ఈ మూవీకి సీక్వెల్ ఓదెల 2 (Odela 2) వస్తోందని తెలిసిందే. సీక్వెల్ పార్టులో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే ఓదెల 2 షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకొని మేకర్స్ సరికొత్త అప్డేట్ను ఫస్ట్ లుక్ రూపంలో అందించారు.
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.. ఓం నమ: శివాయ.. అంటూ తమన్నా స్పెషల్ లుక్ షేర్ చేశారు. ఇప్పటివరకు గ్లామరస్, స్టైలిష్ రోల్స్‌లో నటించిన తమన్నా ఈ సారి మాత్రం రూట్ మార్చేసింది. ఓదెల 2 సినిమా కోసం శివశక్తిగా మారిపోయింది. శివశక్తి లుక్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఇందులో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించబోతుందని తెలియజేశారు మేకర్స్ .
ఓదెల 2లో వశిష్ఠ ఎన్ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్నారు. ఓదెల 2కు కాంతార చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
గ్లామరస్, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో అందరినీ అలరించిన తమన్నా.. ఓదెల 2లో గూస్ బంప్స్ తెప్పించే యాక్టింగ్‌తో అదరగొట్టడం ఖాయమని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
శివశక్తిగా తమన్నా.. మహాశివరాత్రి స్పెషల్ లుక్..
Introducing the sparkling @tamannaahspeaks in a never seen before avatar as ‘Shiva Shakthi’ from #Odela2 – a fierce devotee of the Mahadev & a virtuous saviour of Odela ✨
Wishing you all a very Happy Maha Shivaratri. Om Namah Shivaya 🔱@IamSampathNandi @ashokalle2020… pic.twitter.com/tXFtpYTkBQ
— BA Raju’s Team (@baraju_SuperHit) March 8, 2024
ట్రెండింగ్‌లో ఓదెల 2 స్టిల్స్..
The thrills will go to the next level 🔥
Announcing #Odela2 starring the gorgeous @tamannaahspeaks in a never seen before role ❤️🔥
Created by @IamSampathNandi 💥
Shoot begins today in the divine city of Kashi. More updates soon!@ashokalle2020 @SampathNandi_TW @HariPrriya6… pic.twitter.com/IHBZq9c1AY
— B AJANEESH LOKNATH (@AJANEESHB) March 1, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

