ఆక్లాండ్: న్యూజిలాండ్(New Zealand)కు భారీ జలక్ తగిలింది. ఇద్దరు క్రికెటర్లు గాయపడ్డారు. మార్క్ చాప్మాన్, జాక్ ఫోక్స్ గాయాలపాలయ్యారు. దీంతో ఆ ఇద్దరూ భారత్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరంకానున్నారు. అక్టోబర్ 22 నుంచి కివీస్‌తో టీ20 సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. గత నెలలో జరిగిన యురోపియన్ టీ20 లీగ్‌లో చాప్మాన్ ఎడమ కాలి కండరాలు పట్టేశాయి. 32 ఏళ్ల చాప్మాన్ ఇప్పటి వరకు 113 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఇండియాతో జరిగే వన్డే సిరీస్ నాటికి అతను సిద్దం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫోక్స్ మళ్లీ ఎప్పుడు జట్టుతో కలుస్తాడో క్లారటీ లేదు.
ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్సన్, ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ను గాయపడ్డ వారి స్థానంలో తీసుకున్నారు. ఇద్దరు కీలక ఆటగాళ్లను మిస్స్ కావడం నష్టమే అవుతుందని కివీస్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు. నవంబర్ ఒకటిన హామిల్టన్‌లో చివరి టీ20 ఉంటుంది. కివీస్ టీ20 జట్టులో మిచెల్ సాంట్నర్, ఫిన్ అల్లెన్, మైకేల్ బ్రేస్‌వెల్, జోష్ క్లార్క్సన్, డేవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, బేవాన్ జాకబ్స్, కైలీ జేమీసన్, ఆడమ్ మిల్నీ, డారెల్ మిచ్చెల్, గ్లెన్ ఫిలిప్స్. టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ ఉన్నారు.