వెల్లింగ్టన్: న్యూజిలాండ్ టెస్టు క్రికెటర్ హెన్రీ నికోల్స్పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు గుప్పుమన్నాయి. దేశవాళీ టోర్నీ ప్లంకెట్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా సెంటర్బరీ, ఆక్లాండ్ మధ్య మ్యాచ్‌లో నికోల్స్ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడు.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్‌గా మారడంతో.. కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అతడిపై చర్యలకు సిద్ధమైంది. నికోల్స్ బంతిని హెల్మెట్‌కు రుద్దుతూ దాని ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడంతో ఈ దూమారం రేగింది.