అంతర్జాతీయ క్రికెట్‌కు రాస్ టేలర్ వీడ్కోలు
Ross Taylor | న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో జరగనున్న సిరీస్‌ల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు

హైదరాబాద్: న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో జరగనున్న సిరీస్‌ల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ తలపడనుంది. ఇవే తనకు చివరి టెస్టు మ్యాచులు అని రాస్ టేలర్ చెప్పాడు. అదేవిధంగా ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్, సొంతగడ్డలో మార్చి నెల చివర్లో నెదర్లాండ్స్‌తో జరగనున్న వన్డే సిరీస్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు చెప్పాడు. అంటే ఏప్రిల్ 4న హామిల్టన్‌లో జరగనున్న వన్డే మ్యాచ్‌తో టేలర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగియనుంది. 17 ఏండ్లపాటు తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.
Today I'm announcing my retirement from international cricket at the conclusion of the home summer, two more tests against Bangladesh, and six odi’s against Australia & the Netherlands. Thank you for 17 years of incredible support. It’s been an honour to represent my country #234 pic.twitter.com/OTy1rsxkYp
— Ross Taylor (@RossLTaylor) December 29, 2021
ఈ 37 ఏండ్ల రాస్ టేలర్ న్యూజిలాండ్ తరఫున అనేక రికార్డులు నెలకొల్పాడు. 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు 112 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అతడు 7584 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. కేన్ విలియమ్సన్ తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
అదేవిధంగా 2006లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే కెరీర్ ప్రారంభించాడు. మొత్తం 233 వన్డేలు ఆడిన టేలర్.. 21 సెంచరీలతో 8581 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు 102 టీ20 మ్యాచ్‌లు ఆడిన టేలర్.. అన్ని ఫార్మట్లలోనూ వందకుపైగా మ్యాచ్‌లు ఆడిన మొదటి ప్లేయర్‌గా ఘనత సాధించాడు.
What a legend congratulations mate 🙌🏻🙌🏻
— Rashid Khan (@rashidkhan_19) December 30, 2021
Well done @RossLTaylor absolutely amazing career and look forward to catching up with you in Australia. https://t.co/1iDmM2CEje
— David Warner (@davidwarner31) December 30, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

