New York Knicks | బాస్కెట్‌బాల్ చరిత్రలో న్యూయార్క్ నిక్స్ (New York Knicks) జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 53 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎన్బీఏ (NBA) కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా సాగిన ఎన్బీఏ ఫైనల్స్ పోరులో న్యూయార్క్ నిక్స్ జట్టు 4–1 తేడాతో సాన్ ఆంటోనియో (San Antonio) జట్టును మట్టికరిపించి ఘనవిజయం సాధించింది.
ఈ అద్భుత విజయంతో న్యూయార్క్ నిక్స్ ఫ్రాంచైజీ చరిత్రలోనే మూడోసారి ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరిసారిగా 1973లో ఈ టైటిల్ గెలిచిన నిక్స్ జట్టు, మళ్లీ ఇన్నాళ్లకు కప్‌ను ముద్దాడటంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు మైదానంలో సంబరాల్లో మునిగిపోయారు. పటిష్టమైన సాన్ ఆంటోనియో జట్టుపై మొదటి నుంచీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన న్యూయార్క్ నిక్స్, ఫైనల్ సిరీస్‌లో తిరుగులేని ఆటతీరుతో ఈ చారిత్రాత్మక విజయాన్ని తన సొంతం చేసుకుంది.
FOR THE FIRST TIME IN 53 YEARS, THE KNICKS ARE NBA CHAMPIONS 🏆
New York defeats San Antonio 4-1 in the NBA Finals, capturing their third championship in franchise history! pic.twitter.com/i1gmntBe06
— NBA (@NBA) June 14, 2026