న్యూఢిల్లీ: ఒలింపిక్ మెడలిస్టు, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. హిమానీ మోర్( Himani Mor) అనే అమ్మాయిని అతను పెళ్లాడాడు. హిమాచల్ ప్రదేశ్‌లో చాలా సాదాసీదాగా కేవలం 50 మంది అతిథుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి వేడుక నిర్వహించారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒలింపిక్ స్టార్ నీరజ్ తన మ్యారేజ్ విషయాన్ని చెప్పాడు. పెళ్లి పీఠలపై కూర్చున్న ఫోటోను పోస్టు చేసి అందర్నీ స్టన్ చేశాడు. నీరజ్ చోప్రా భార్య పేరు హిమానీ మోర్. ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
హిమానీ మోర్ వయసు 25 ఏళ్లు. ఆమె టెన్నిస్ క్రీడాకారిణి. సోనిపట్ ఆమె సొంతూరు. అక్కడ లిటిల్ ఏంజిల్స్ స్కూల్లో ఆమె చదువుకున్నది. ప్రస్తుతం హిమానీ మోర్.. న్యూ హాంప్‌షైర్‌లోని ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నది. ఢిల్లీలోని మిరండా హౌజ్ అల్యూమినిలో ఉన్నది. పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఆమె బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకు ఓ సోదరుడు ఉన్నాడు. అతని పేరు హిమాన్షు. అతను కూడా టెన్నిస్ ప్లేయరే.
जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। 🙏
Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.
नीरज ♥️ हिमानी pic.twitter.com/OU9RM5w2o8
— Neeraj Chopra (@Neeraj_chopra1) January 19, 2025
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గతంలో జాతీయ స్థాయిలో ఆమె పోటీపడింది. 2017లో తైపయిలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ పార్టిసిపేట్ చేసింది. 2016లో మలేషియాలో జరిగిన వరల్డ్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆమె గోల్డ్ మెడల్ గెలిచినట్లు స్కూల్ వెబ్సైట్లో ఉంది. సోనిపట్‌కు చెందిన అమ్మాయి.. అమెరికాలో చదువుతున్నదని, రెండు రోజుల క్రితం ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని, ప్రస్తుతం హనీమూన్ కోసం ఆ ఇద్దరూ దేశం విడిచి వెళ్లారని, వాళ్లు వెళ్లిన ప్రదేశం గురించి తెలియదని నీరజ్ చోప్రా సోదరుడు బీమ్ చోప్రా తెలిపారు.
ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ వెబ్సైట్ ప్రకారం.. హిమానీ మోర్ తన సింగిల్స్ కెరీర్లో నేషనల్ బెస్ట్ ర్యాంక్ 42. డబుల్స్‌లో 27వ ర్యాంక్ సాధించింది. 2018 నుంచి ఆమె ఏఐటీఏ ఈవెంట్లలో ఆడడం స్టార్ట్ చేసింది. మసాచూసెట్స్ ఆమ్హెస్ట్ కాలేజీలో మహిళల టెన్నిస్‌కు ఆమె అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నది.