కామారెడ్డి, జనవరి 8 :జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి అండర్- 17 బాలుర కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సోమవారం ఆతిథ్య తెలంగాణ, ఉత్తరాఖండ్ మధ్య జరిగిన పోరు టై గా ముగిసింది. ఆద్యంతం నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోరు సమమైంది. మరోవైపు కేరళపై ఉత్తరప్రదేశ్ 12 పాయింట్లతో, హిమాచల్‌ప్రదేశ్‌పై కర్ణాటక 8 పాయింట్లతో, కేంద్రీయ విద్యాలయంపై ఢిల్లీ 14 పాయింట్లతో, పంజాబ్‌పై 28పాయింట్లతో బీహార్, కేంద్రీయ విద్యాలయంపై 11 పాయింట్లతో ఒడిశా, జార్ఖండ్‌పై 63 పాయింట్లతో మహారాష్ట్ర, పాండిచ్చేరిపై 21 పాయింట్లతో తమిళనాడు విజయాలు సాధించాయి. ఈ నెల 11వ తేదీ వరకు పోటీలు కొనసాగనున్నాయి.