టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్లో పాండ్యా సోదరులు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. బయో బబుల్‌లో ఉన్నా మ్యాచ్ నుంచి విరామం లభించడంతో పాండ్య బ్రదర్స్ హార్దిక్, కృనాల్ ఒక్కచోట చేరి సరదాగా సమయం గడిపారు. కృనాల్ భార్య పంకూరి శర్మ,
హార్దిక్ వైఫ్ నటాశా స్టాంకోవిచ్లతో కలిసి అగస్త్య స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేశాడు.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలను నటాశా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా హార్దిక్ ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. మరోవైపు అగస్త్య తన పెద్దనాన్న కృనాల్తోనూ పూల్‌లో కేరింతలు కొట్టాడు. వీరిద్దరూ పూల్‌లో ఉండగా అగస్త్య తన తండ్రి హార్దిక్‌ను చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. ముంబై తన తర్వాతి మ్యాచ్‌లో మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
Guess whose team he’s in when we have to laugh at Daddy Pandya 😎🤣 @hardikpandya7 pic.twitter.com/xCbczIz2rX
— Krunal Pandya (@krunalpandya24) April 11, 2021
☀️ the kind of Sundays I love ❤️ pic.twitter.com/lia7HqgIjB
— hardik pandya (@hardikpandya7) April 11, 2021