చెన్నై: హ్యాట్రిక్ ఓటముల తర్వాత గత మ్యాచ్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ మోకాలి గాయం వల్ల సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్టు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో నట్టూ మోకాలి గాయానికి గురికాగా.. ఇప్పుడు మరోసారి అది తిరగబెట్టడంతో ప్రస్తుత సీజన్లో రెండు మ్యాచ్‌లే ఆడాడు.