MI vs UPW : కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) మిడిలార్డర్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ (51) హాఫ్ సెంచరీ కొట్టింది. 24 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఫిఫ్టీ బాదింది. 6 పరుగులు వద్ద ఎకిల్‌స్టోన్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన ఆమె చెలరేగి ఆడింది. ఓపెనర్ మాథ్యూస్ (26), హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి విలువైన పరుగులు జోడించింది. బిగ్ వికెట్ కోల్పోయింది. నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కేర్(9) క్రీజులో ఉన్నారు. ఫామ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్(14)ను 13వ ఓవర్లో ఎకిల్‌స్టోన్ బౌల్డ్ చేసింది. దాంతో, 104 రన్స్ వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది.