నమీబియా.. పేరుకు పసికూన అయినా.. చిన్న టీమ్ అయినా ఈసారి సూపర్ 12 స్టేజ్‌లో కూడా తన ఉనికిని చాటుకుంది. సూపర్ 12 లో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో నమీబియా తన సత్తాను చాటింది. ముందు కాస్త తడబడినా.. వరుసగా వికెట్లను నష్టపోయినా.. నమీబియా ఆటగాళ్లు.. టీమిండియా ముందు ఓ మోస్తారు టార్గెట్‌ను ఉంచారు.
20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి నమీబియా 132 పరుగులు చేసి ఇండియాకు 133 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. నమీబియా ప్లేయర్లలో డేవిడ్ వీస్.. టీమ్‌ను ఆదుకున్నాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రంపెల్మాన్ 6 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఒక సిక్స్, ఒక ఫోర్ బాదాడు. భారత బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా 2 వికెట్లు తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత నమీబియా బ్యాటింగ్ బరిలోకి దిగింది.
నమీబియా ఓపెనర్లలో బార్డ్ 21 బంతుల్లో 21 పరుగులు చేయగా.. మైకెల్ వాన్ 15 బంతుల్లో 14 పరుగులు చేశాడు. విలియమ్స్ డక్ అవుట్ కాగా.. గెర్హార్డ్.. 20 బంతుల్లో 12 పరుగులు చేశాడు. జాన్ నికోల్ 5, డేవిడ్ వీస్ 26, స్మిత్ 9, ఫ్రైలింక్ 15 పరుగులు, రుబెన్ ట్రంపెల్మాన్ 13 పరుగులు చేశారు.
🎯 set!
— T20 World Cup (@T20WorldCup) November 8, 2021
India will chase down a score of 133 for a victory ✌️
Can Namibia defend this?#T20WorldCup | #INDvNAM | https://t.co/ICh1BVKEFJ pic.twitter.com/U61m2kLFCl
Excellent from Bumrah 👏
— T20 World Cup (@T20WorldCup) November 8, 2021
A change of pace does wonders and gets him the scalp of David Wiese. #T20WorldCup | #INDvNAM | https://t.co/ICh1BVKEFJ pic.twitter.com/tNUl8oXIZn
A brilliant grab from Rohit Sharma 🤲
— T20 World Cup (@T20WorldCup) November 8, 2021
Jadeja has his third as Smit walks back for 9. #T20WorldCup | #INDvNAM | https://t.co/ICh1BVKEFJ pic.twitter.com/fmDqfNQmom