సోమవారం 18 జనవరి 2021
Sports - Dec 28, 2020 , 13:59:17

అభిమాని న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆట‌కు అంత‌రాయం!

అభిమాని న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆట‌కు అంత‌రాయం!

వెల్లింగ్ట‌న్‌: న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు సంద‌ర్భంగా ఓ వింత సంఘ‌ట‌న చోటుచేసుకుంది.   మ్యాచ్ జరుగుతుండగానే ఓ అభిమాని నగ్నంగా మైదానంలోకి పరిగెత్తుకొచ్చాడు. అంతేకాదు సెక్యూరిటీ సిబ్బంది అత‌డిని బంధించేందుకు వెండించ‌డంతో మైదాన‌మంతా పరుగులు తీశాడు. ఎడ‌మ చేత్తో తన మర్మాంగాన్ని దాచుకొని, కుడి చేత్తో సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటూ ప‌రుగుపెట్టి హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఎట్ట‌కేల‌కు సెక్యూరిటీ సిబ్బంది అత‌డిని బంధించి బ‌య‌టికి తీసుకెళ్లారు. 

అయితే, న‌గ్న అభిమాని హ‌ల్‌చల్‌తో ఆట‌కు కొంత‌సేపు అంత‌రాయం క‌లిగింది. కాగా, ప్రస్తుతం ఆ వ్య‌క్తికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘటనతో ఆటగాళ్లు, అభిమానులు ఒక్క‌సారిగా షాక‌య్యారు. అత‌నిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.