మాడ్రిడ్: గాయం కారణంగా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌తో పాటు ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు దూరమైన టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ (స్పెయిన్).. యూఎస్ ఓపెన్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కాలి గాయం తిరగబెట్టడంతో ఈ ఏడాది కోర్టులో అడుగుపెట్టబోనని వెల్లడించాడు. ‘నన్ను క్షమించండి. గాయం కారణంగా 2021 సీజన్‌కు దూరమవుతున్నా. ఏడాది కాలంగా కాలి గాయంతో బాధపడుతున్నా. దీనివల్ల ఎన్నో ముఖ్యమైన టోర్నీలకు దూరం కావాల్సి వచ్చింది’ అని 35 ఏండ్ల నాదల్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.