IPL 2023 | బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీపర్‌గా అభిషేక్
IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఈరోజుతో మొదలు కానుంది. దాంతో, ముంబై ఇండియన్స్(Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు గాయపడిన బుమ్రా స్థానంలో సందీప్ వారియర్, రిషభ్ పంత్ ప్లేస్‌లో అభిషేక్ పొరెల్‌ను తీసుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు అహ్మదాబాద్ స్టేడియంలో ఐపీఎల్ ఆరంభ వేడుక జరగనుంది.
IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఈరోజుతో మొదలు కానుంది. దాంతో, ముంబై ఇండియన్స్(Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు టోర్నీకి దూరమైన ఆటగాళ్ల ప్లేస్‌లో మరొకరిని తీసుకున్నాయి. ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) స్థానంలో యంగ్ పేసర్ సందీప్ వారియర్( Sandeep Warrier)ను తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ ఫ్రాంచైజీ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) స్థానంలో అభిషేక్ పొరెల్(Abhishek Porel)ను ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా సర్జరీ కోసం న్యూజిలాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీ జట్టు రెగ్యులర్ కెప్టెన్ పంత్ కారు గత ఏడాది కారు యాక్సిడెంట్లో గాయపడిన సంగతి తెలిసిందే. మోకాలికి సర్జరీ కావడంతో అతను కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది.
కుడి చేతివాటం మీడియం పేసర్ సందీప్‌ది కేరళ. దేశవాళీలో కేరట, తమిళనాడు జట్లకు ఆడిన ఇతను 2021లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. అయితే.. టీమిండియా తరఫున ఒకే ఒక టీ20 మ్యాచ్ (శ్రీలంకపై) ఆడాడు. గత సీజన్లో సందీప్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు అతను 68 టీ20లు ఆడాడు.
బెంగాల్ కీపర్‌కు ఛాన్స్
ఢిల్లీ యాజమాన్యం రిషభ్ పంత్ స్థానంలో బెంగాల్ వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్‌ను తీసుకుంది. పంత్ ప్లేస్ కోసం.. షెల్డన్ జాక్సన్, లవ్‌నీత్ సిసోడియా, వివేక్ సింగ్, అభిషేక్ మధ్య పోటీ నెలకొంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో వీళ్ల కీపింగ్ స్కిల్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరభ్ గంగూలీ పరిశీలించారు. దేశవాళీలో బెంగాల్ తరఫున రాణించిన అతడిపైనే నమ్మకం ఉంచారు. అంతేకాదు ఈ సీజన్‌కు ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ అప్పగించింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్ చేసింది.
🚨 NEWS🚨@DelhiCapitals name Abhishek Porel as Rishabh Pant’s replacement; Sandeep Warrier joins @mipaltan as Jasprit Bumrah’s replacement.
Details 🔽 #TATAIPL https://t.co/NKrc6oLJrI
— IndianPremierLeague (@IPL) March 31, 2023
ఆరంభం అదిరిపోయేలా..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు సాయంత్ర 5ః30 గంటల నుంచి ఐపీఎల్ ఓపెనింగ్ సెరమొనీ జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాతో పాటు పలువురు అధికారులు టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరుకానున్నారు. ఇండియా క్రష్‌గా పేరొందిన కన్నడభామ రష్మిక మందాన (Rashmika Mandanna), మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా (Tamanna Bhatia) ఆరంభ వేడుకల్లో డాన్స్‌తో అలరించనున్నారు. బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్(Arjith Singh) తన గాత్రంతో అభిమానులను ఫిదా చేయనున్నాడు. అనంతరం పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
David Miller: మిల్లర్ లేకుండానే ఫస్ట్ మ్యాచ్‌కు గుజరాత్ రెఢీ
Virat Kohli: ఫ్యాషన్ షోలో విరుష్కా జోడి.. కొత్త లుక్‌లో స్టార్ జంట
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

