Virat Kohli: ఫ్యాషన్ షోలో విరుష్కా జోడి.. కొత్త లుక్‌లో స్టార్ జంట
Virat Kohli: కోహ్లీ, అనుష్కాలు డయిర్ షోలో పాల్గొన్నారు. ట్రెండీ డ్రెస్సులో ఆ స్టార్ కపుల్ కనిపించింది. ఒలివ్ గ్రీన్‌లో కోహ్లీ.. ఎల్లో గౌన్‌లో అనుష్కాలు.. ఈవెంట్‌కు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. బాలీవుడ్ నటి అనుష్కా శర్మ(Anushka Sharma).. ఫ్యాషన్ లుక్‌లో కవ్విస్తున్నారు. ఆ స్టార్ జోడి ముంబైలో జరిగిన డయిర్ ఆటమ్(Dior Autumn) 2023 ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్నది. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన షోలో విరుష్కా జంట కొత్త స్టయిల్లో దర్శనమిచ్చింది. డయిర్ కంపెనీ తన కలెక్షన్‌ను ప్రమోట్ చేసేందుకు ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. ఆ షోలో బాలీవుడ్ స్టార్స్ సోనమ్ కపూర్, అనన్యా పాండే, సైమోన్ ఆష్లే, ఇషా అంబానీ, రాధికా మర్చంట్ కూడా పాల్గొన్నారు.
Virat Kohli and Anushka Sharma at the Dior eventpic.twitter.com/DbXCne1F4i
— Shaurya (@Kohli_Dewotee) March 30, 2023
డైనమిక్ జోడి కోహ్లీ, అనుష్కాలు తమ డ్రెస్సులతో ఫోజులిచ్చారు. ఒలివ్ గ్రీన్ బ్లేజర్(Olive Green Blazer) వేసుకున్న విరాట్ కోహ్లీ.. వైట్ టీషర్ట్, స్నీకర్స్‌తో అట్రాక్ట్ చేశాడు. ఇక అనుష్కా శర్మ ఎల్లో గౌన్‌లో మెరిసిపోయింది. ప్లాట్‌ఫామ్ హీల్స్ వేసిన అనుష్కా.. కోహ్లీతో కలిసి రకరకాల స్టిల్స్ ఇచ్చింది. ఇక అనుష్కా తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. ఎర్త్ ఎమోజీ పోస్టు చేసిన అనుష్కాకు.. విరాట్ హార్ట్ ఎమోజీలతో రియాక్ట్ అయ్యారు.
విరాట్, అనుష్కాలు డిసెంబర్ 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021 జనవరిలో ఆ జంటకు అమ్మాయి పుట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

